అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా శ్రీ శివపార్వతుల దివ్య కల్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ATA స్పిరిచువల్ కమిటీ ప్రకటించింది.
ఈ పవిత్ర వేడుకకు ATA సభ్యులు, తెలుగు కుటుంబాలు, భక్తులు, భారతీయ సమాజ సభ్యులందరికీ స్పిరిచువల్ కమిటీ ఘన ఆహ్వానం పలికింది. ఈ దివ్య కల్యాణాన్ని భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ఉత్సవ మూర్తులను భారతదేశం నుంచి అమెరికాకు తీసుకురానున్నారు.
ATA చరిత్రలోనే తొలిసారిగా ఇంత వైభవంగా నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం తెలుగు సంప్రదాయాలను, సనాతన ధర్మ వైభవాన్ని అమెరికా గడ్డపై ప్రతిష్ఠాత్మకంగా చాటిచెప్పనుంది.
ఈ సందర్భంగా భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని పరమేశ్వరుడు, పార్వతీదేవి దివ్య ఆశీర్వాదాలను పొందాలని, ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని ATA స్పిరిచువల్ కమిటీ పిలుపునిచ్చింది.
తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్…
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని…
ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి…
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో…