Categories: Movie News

‘RAW NTR’ సంస్థతో సంబంధం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ!!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. తారక్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ సందర్భంలోనే ‘RAW NTR’ సంస్థ ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఎన్టీఆర్ ఆఫీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అనధికారిక సంస్థలు, వ్యక్తుల ద్వారా జరిగే ప్రచారాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపింది. అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్‌, సోషల్‌ మీడియా వేదికలు అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్టీఆర్‌ కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖలో తెలిపింది.

ManaTV Team

Recent Posts

టీటీఏ మెగా కన్వెన్షన్‌కు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా

తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్ అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై…

6 hours ago

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలపై క్లారిటీ..

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో…

7 hours ago

ATA : అమెరికాలో శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం

అమెరికాలో జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్–2026లో ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలుకుతూ తొలిసారిగా…

7 hours ago

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో సందడి చేయనున్న సుమ, రవి, మామ మహేష్.. షార్లెట్‌లో మూడు రోజుల వినోదోత్సవం

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్…

8 hours ago

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ..కుటుంబ సభ్యులు ఎక్కడ?

ప్రముఖ నటి శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలో కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి…

12 hours ago

విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ ‘ట్రైన్’ .. ఆగస్టులో రిలీజ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’. ఈ చిత్రాన్ని ఆగస్టులో థియేటర్లలో…

13 hours ago