Categories: Movie News

చిరంజీవి దంపతులకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బండ్ల గణేశ్.. వైరల్‌గా ఫొటోలు

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన ఆయన, ఆగస్టు 16న జరగనున్న వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి ఆశీస్సులు పొందిన బండ్ల గణేశ్ తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. “నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ భావోద్వేగంగా పోస్టు చేశారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ #JananiSuryaPayanam హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో జరగనుంది. ఆగస్టు 16న ఉదయం 11:58 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఇప్పటికే జరిగిన నిశ్చితార్థం, పసుపు-కుంకుమ కార్యక్రమాలకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు కూడా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ManaTV Team

Recent Posts

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు… ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో కంటెంట్ ఆధారిత…

11 hours ago

అమెరికాలో తెలుగు సంస్కృతి సందడి.. టీటీఏ మెగా కన్వెన్షన్-2026 ఘనంగా ప్రారంభం

అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)…

11 hours ago

కీళ్ల మార్పిడిలో రోబోటిక్ విప్లవం.. MANA TVతో డాక్టర్ గురవారెడ్డి ముచ్చట్లు

షార్లెట్ (అమెరికా): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్…

12 hours ago

విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయవంతం.. భారత అంతరిక్ష రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్ మరో మైలురాయి

హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్  స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ…

14 hours ago

‘ వన్ అండ్ ఓన్లీ పర్సన్’.. క్రికెట్ దిగ్గజం సోబర్స్‌కు కోహ్లీ, సచిన్ నివాళి

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్‌ఫీల్డ్…

18 hours ago

ఫ్యాన్స్‌కు ప్రియాంక బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ నుంచి క్రేజీ లుక్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది.. దిగ్గజ…

20 hours ago