Categories: NRI Updates

అమెరికాలో తెలుగు సంస్కృతి సందడి.. టీటీఏ మెగా కన్వెన్షన్-2026 ఘనంగా ప్రారంభం

అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీటీఏ మెగా కన్వెన్షన్-2026 తొలి రోజు వేడుకలు కళాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభకు అమెరికాతో పాటు పలు దేశాల నుంచి తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కార్యక్రమం ప్రారంభంలో అతిథులకు టీటీఏ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. చార్లెట్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు డింపుల్ అజ్మీరా, మేయర్ హరింగ్టన్‌తో పాటు టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కన్వెన్షన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, వంశీ రెడ్డి తదితరులను సంస్థ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది ప్రత్యేకంగా అభినందించారు.

తొలి రోజు నిర్వహించిన ‘జానపదాల జాతర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్, వందేమాతరం శ్రీనివాస్, నర్సిరెడ్డి కాసాలా, సంధ్య, నల్గొండ గద్దర్, కాసర్ల శ్యామ్ తమ గాన, సాహిత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. తెలంగాణ జానపద గీతాలతో సభా ప్రాంగణం కళకళలాడింది.

ఈ సందర్భంగా వైద్యం, జర్నలిజం, ఐటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతికం, సాహిత్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను టీటీఏ ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించింది. వారి సేవలను కొనియాడుతూ సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతిని కాపాడుతూ భావితరాలకు అందించడం గర్వకారణమన్నారు. భారత అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర మరింత కీలకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

టీటీఏ సావనీర్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. యాంకర్ సుమ కనకాల వేదికపై చేసిన సరదా వ్యాఖ్యలు సభికులను అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డుల ప్రదానం, ప్రముఖుల ప్రసంగాలతో తొలి రోజు వేడుకలు విజయవంతంగా ముగియగా, మిగిలిన రెండు రోజుల కార్యక్రమాలపై కూడా పాల్గొనేవారిలో ఆసక్తి నెలకొంది.

ManaTV Team

Recent Posts

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు… ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో కంటెంట్ ఆధారిత…

11 hours ago

చిరంజీవి దంపతులకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బండ్ల గణేశ్.. వైరల్‌గా ఫొటోలు

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను…

11 hours ago

కీళ్ల మార్పిడిలో రోబోటిక్ విప్లవం.. MANA TVతో డాక్టర్ గురవారెడ్డి ముచ్చట్లు

షార్లెట్ (అమెరికా): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్…

12 hours ago

విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయవంతం.. భారత అంతరిక్ష రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్ మరో మైలురాయి

హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్  స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ…

14 hours ago

‘ వన్ అండ్ ఓన్లీ పర్సన్’.. క్రికెట్ దిగ్గజం సోబర్స్‌కు కోహ్లీ, సచిన్ నివాళి

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్‌ఫీల్డ్…

18 hours ago

ఫ్యాన్స్‌కు ప్రియాంక బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ నుంచి క్రేజీ లుక్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది.. దిగ్గజ…

20 hours ago