Categories: Movie News

ఫ్యాన్స్‌కు ప్రియాంక బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ నుంచి క్రేజీ లుక్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది.. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘మందాకిని’ అనే పాత్రలో ప్రియాంక చోప్రా ఫెరోషియస్ అవతార్‌లో కనిపించగా.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ‘వీక్లీ’ ఈ ఫొటోలను ప్రత్యేకంగా పంచుకోగా.. ప్రియాంక కంప్లీట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో, ఉంగరాల జుట్టుతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఇక చిత్రంలో ఆమె పోషిస్తున్న ‘మందాకిని’ పాత్రను “ప్రపంచవ్యాప్తంగా పర్యటించే ఒక ధైర్యవంతురాలు, శక్తిమంతమైన మహిళ. అదే సమయంలో సున్నితమైన భావోద్వేగాలు కలిగి, ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోయే పాత్ర” అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సరసన నటిస్తున్నారు. మహేశ్‌ ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు రామాయణ యుద్ధ ఘట్టాలకు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశంలో శ్రీరాముడి పాత్రలో కూడా మహేశ్‌ బాబు కనిపించనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న విడుదల చేసే అవకాశం ఉంది.

ManaTV Team

Recent Posts

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు… ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో కంటెంట్ ఆధారిత…

11 hours ago

అమెరికాలో తెలుగు సంస్కృతి సందడి.. టీటీఏ మెగా కన్వెన్షన్-2026 ఘనంగా ప్రారంభం

అమెరికాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)…

11 hours ago

చిరంజీవి దంపతులకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బండ్ల గణేశ్.. వైరల్‌గా ఫొటోలు

ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను…

11 hours ago

కీళ్ల మార్పిడిలో రోబోటిక్ విప్లవం.. MANA TVతో డాక్టర్ గురవారెడ్డి ముచ్చట్లు

షార్లెట్ (అమెరికా): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ నగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్…

12 hours ago

విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయవంతం.. భారత అంతరిక్ష రంగంలో స్కైరూట్ ఏరోస్పేస్ మరో మైలురాయి

హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్  స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ…

14 hours ago

‘ వన్ అండ్ ఓన్లీ పర్సన్’.. క్రికెట్ దిగ్గజం సోబర్స్‌కు కోహ్లీ, సచిన్ నివాళి

క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం నెలకొంది. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన సర్ గార్‌ఫీల్డ్…

18 hours ago