టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. బ్లాక్ బస్టర్ బంగారం అనే క్యాప్షన్ ను జత చేశారు. నిజానికి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషం.
సినిమా భారీ విజయంపై సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మొదటి రోజు ఇంతటి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. యూత్ నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆశీర్వదించడానికి రావడం గొప్ప అనుభూతిని ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. థియేటర్లకు కేవలం పురుషులు మాత్రమే కాకుండా, పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి కలెక్షన్ల వర్షం కురిపించడం సినీ పరిశ్రమ ఎదుగుదలకు నిదర్శనం. మా చిన్న ప్రొడక్షన్ హౌస్ అనుకున్నది సాధించింది.. ట్రా-లా-లా….” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సమంత సెంటిమెంట్ సీన్స్‌లోనే కాకుండా యాక్షన్ సీన్స్ లోనూ అత్యద్భుతంగా నటించారు. అలాగే శ్రీముఖి కామెడీ టైమింగ్ అదిరిపోగా, సమంత మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. బాపు బొమ్మల శైలిలో డిజైన్ చేసిన టైటిల్ కార్డ్స్, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత, హిమాంక్ దువ్వూరులతో కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్ నిడిమోరు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇక మా ఇంటి బంగారం కలెక్షన్ల జోరు ఈ వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…