Find Articles

హీరోయిన్ హనీ రోజ్ కు వ్యాపారవేత్త క్షమాపణ

హీరోయిన్ హనీ రోజ్ కు వ్యాపారవేత్త క్షమాపణ

కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ హీరోయిన్ హనీ రోజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుకలో హనీ రోజ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే తనపై లైంగిక భావనలతో, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చెమ్మనూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో, బాబీ చెమ్మనూర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందించారు. తన వ్యాఖ్యలు హనీ రోజ్‌ను, ఆమె కుటుంబాన్ని బాధపెట్టాయని గ్రహించానని చెప్పారు. ఈ వివాదానికి పూర్తి బాధ్యత వహిస్తున్నానన్న చెమ్మనూర్, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించారు. ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అలాగే ఆమె తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే వ్యాపారవేత్త చెమ్మనూర్ చేసిన ఈ బహిరంగ క్షమాపణలపై హనీ రోజ్ ఇంకా స్పందించలేదు.

ManaTV Team