
అపరిచితులు పంపించే లింక్స్ క్లిక్ చేసి యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకండి. ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్స్ ఇన్‌స్టాల్ చేయడం వలన మాల్‌వేల్ చొరబడే అవకాశం ఉంటుందని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సైబర్ సెల్ నీ సంప్రదించాలని సూచించారు.

