Find Articles

రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

అలాగే సిద్ధిపేట, దుబ్బాకలో నూతనంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో పలు కీలక కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

ManaTV Team