తెలంగాణలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు.
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే రోజుల్లో నీటి అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమ్మక్క సాగర్లో నీటి నిల్వలు కీలకమని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం.
ఈ విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీతో సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.