టాలీవుడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ అందాల భామకు, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా షూటింగ్ సమయం నుంచే ఈ డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. గతంలో హీరో రామ్ ఈ రూమర్లను కొట్టిపారేసినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనంగానే ఉంటూ వచ్చారు. ఇటీవలే ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ ఆమెకు “మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?” అనే క్రేజీ ప్రశ్న ఎదురైంది. దీనికి భాగ్యశ్రీ బదులిస్తూ.. అఖిల్ అక్కినేని తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. కానీ, డేటింగ్, పెళ్లి విషయానికి వచ్చేసరికి.. తాను కలిసి నటించిన హీరోల్లో ప్రస్తుతం పెళ్లికాని బ్యాచిలర్ ఒక్కరే మిగిలారంటూ నవ్వేశారు.
భాగ్యశ్రీ నేరుగా పేరు చెప్పనప్పటికీ, ఆమె పరోక్షంగా రామ్ పోతినేని గురించే ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి..ఈ సందర్భంలోనే రామ్ అభిమానులు, నెటిజన్లు సరదాగా ‘భాగ్యశ్రీ పోతినేని’ అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం ఈ లవ్ రూమర్లపై రామ్ కానీ, భాగ్యశ్రీ కానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న…
భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లండన్‌లోని…
సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే 'నెపోటిజం' (వారసత్వం)పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…
టాలీవుడ్ యువ హీరో అఖిల్ ఎట్టకేలకు సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో…
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.…
అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN'S FORUM)…