Categories: Movie News

బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ ఊచకోత.. అఖిల్ రికార్డ్ ఓపెనింగ్స్!

టాలీవుడ్ యువ హీరో అఖిల్ ఎట్టకేలకు సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

​’లెనిన్’ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. “అఖిల్ 2.0 వచ్చేశాడు.. బాక్సాఫీస్ గట్టిగా విన్నది. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు” అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.

ఈ సినిమాలో అఖిల్ నటన, హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అలాగే అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. ​సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో “అయ్యగారు గట్టి కంబ్యాక్ ఇచ్చారు” అంటూ అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention: టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ప్రముఖుల ఎంపిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న…

2 hours ago

రామ్‌తో డేటింగ్ రూమర్స్.. నోరు విప్పిన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ!

టాలీవుడ్‌లో 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ అందాల భామకు, ఎనర్జిటిక్…

7 hours ago

వింబుల్డన్‌లో గిల్ సందడి.. సచిన్ దంపతులతో కలిసి రాయల్ బాక్స్‌లో టీమిండియా కెప్టెన్!

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లండన్‌లోని…

8 hours ago

నెపోటిజంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. వారసులైనా, అవుట్‌సైడర్స్ అయినా సవాళ్లు తప్పవు!

సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే 'నెపోటిజం' (వారసత్వం)పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…

9 hours ago

‘తక్షకుడు’ షూటింగ్ కంప్లీట్.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.…

11 hours ago

అమెరికాలో భారతీయుల కోసం మెగా హెల్త్ ఫెయిర్ .. జూలై 18న అల్ఫారెట్టాలో ఉచిత వైద్య సేవలు

అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN'S FORUM)…

17 hours ago