Categories: Movie News

‘తక్షకుడు’ షూటింగ్ కంప్లీట్.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. నటుడిగా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాల్లో ఇదొకటని చెప్పారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత డైరెక్టర్ వినోద్ అనంతోజుతో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

తెలుగు ఫోక్‌లోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ అంధుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.. గ్రామస్థుల మరణాలకు కారణమైన వారిపై తన పెంపుడు కుక్కతో కలిసి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర తనకు ఎంతో సవాల్‌గా అనిపించిందని, అదే సమయంలో ఎంతో ఇంట్రెస్టింగ్ కూడా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే లుక్‌ టెస్ట్‌ స్కెచ్‌లు, షూటింగ్‌ సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘తక్షకుడు’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తక్షకుడు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆనంద్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు.

ManaTV Team

Recent Posts

TTA Mega Convention: టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ప్రముఖుల ఎంపిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న…

2 hours ago

రామ్‌తో డేటింగ్ రూమర్స్.. నోరు విప్పిన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ!

టాలీవుడ్‌లో 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ అందాల భామకు, ఎనర్జిటిక్…

7 hours ago

వింబుల్డన్‌లో గిల్ సందడి.. సచిన్ దంపతులతో కలిసి రాయల్ బాక్స్‌లో టీమిండియా కెప్టెన్!

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లండన్‌లోని…

8 hours ago

నెపోటిజంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. వారసులైనా, అవుట్‌సైడర్స్ అయినా సవాళ్లు తప్పవు!

సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే 'నెపోటిజం' (వారసత్వం)పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…

9 hours ago

బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ ఊచకోత.. అఖిల్ రికార్డ్ ఓపెనింగ్స్!

టాలీవుడ్ యువ హీరో అఖిల్ ఎట్టకేలకు సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో…

10 hours ago

అమెరికాలో భారతీయుల కోసం మెగా హెల్త్ ఫెయిర్ .. జూలై 18న అల్ఫారెట్టాలో ఉచిత వైద్య సేవలు

అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN'S FORUM)…

17 hours ago