Find Articles

ఐర్లాండ్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన భారత్

ఐర్లాండ్‌తో తొలి టీ20..  టాస్ గెలిచిన భారత్

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఎలాంటి తడబాటు లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు కూర్పులో అనుభవానికే పెద్దపీట వేసినట్లు స్పష్టం చేశారు. ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ పిచ్ కొత్తగా ఉంది. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. అందుకే తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలనుకుంటున్నామని తెలిపారు.

వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు శ్రేయస్ అయ్యార్ సమాధానం ఇచ్చారు. అతను అద్భుతమైన ప్లేయర్ అనడంలో సందేహం లేదు. కానీ, గత సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు తాము మద్దతుగా నిలవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. సరైన సమయంలో అతనికి తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ముగ్గురు పేసర్లు, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు వివరించారు.

టీమ్స్ వివరాలుః
భారత్ (తుది జట్టు): శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

ఐర్లాండ్ (తుది జట్టు): లోర్కాన్ టకర్ (కెప్టెన్/వికెట్ కీపర్), టిమ్ టెక్టర్, బెంజమిన్ కాలిట్జ్, రాస్ అడైర్, గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్, జై మూంద్రా, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హొలార్డ్, మాథ్యూ హంఫ్రీస్.

ManaTV Team