Find Articles

‘ఇమేజ్’ పడిపోతుందనే భయం.. హీరోల రెమ్యునరేషన్ పై దిల్ రాజ్ కామెంట్స్

‘ఇమేజ్’ పడిపోతుందనే భయం.. హీరోల రెమ్యునరేషన్ పై దిల్ రాజ్ కామెంట్స్

టాలీవుడ్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతుంటాయని, దీని వలన సినిమా బడ్జెట్లు కంట్రోల్ తప్పిపోతుందనే చర్చ ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ పాడ్‎కాస్ట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మార్కెట్ ఈక్వేషన్స్ తాను హీరోలకు ముందే క్లియర్‌గా చెబుతానని, తన బడ్జెట్ పరిధికి సెట్ అయ్యే హీరోలతోనే సినిమాలు చేస్తానని తెలిపారు.

టాలీవుడ్ అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అస్సలు ఇష్టపడరని దిల్ రాజు అన్నారు. దానికి కారణం రెమ్యునరేషన్ తగ్గితే మార్కెట్‌లో తమ ‘ఇమేజ్’ పడిపోతుందనే భయమేనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే… అందులో దాదాపు 35 శాతం నుండి 40 శాతం వరకు (అంటే రూ. 100 కోట్ల నుండి 120 కోట్లు) కేవలం ఒక్క హీరో రెమ్యునరేషన్‌కే వెళ్లిపోతుందని తెలిపారు. ఈ సందర్భంలోనే టాలీవుడ్ బడ్జెట్ సమస్యకు చెక్ పెట్టాలంటే, బాలీవుడ్ ను ఫాలో అవుతున్న సరికొత్త బిజినెస్ స్ట్రాటజీని అనుసరించాలని దిల్ రాజు వెల్లడించారు.

ManaTV Team