నిరుద్యోగులకు అగ్రికల్చర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ సంస్థలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ విభాగాల్లో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
దేశవ్యాప్తంగా 1,393 పోస్టులు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిలవనుంది.