Find Articles

ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ధ్వజస్తంభ ప్రతిష్ఠతో ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆధ్యాత్మిక వైభవం మరింత పెరిగింది. అమెరికాలోని తెలుగు భక్తులకు ఈ మహా సంప్రోక్షణ వేడుకలు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి.

ManaTV Team