అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్ సహకారంతో, రాజ్ జ్యువెల్స్ మద్దతుతో రెనసెంట్ మీడియా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సంగీతం, నృత్య ప్రదర్శనలు, బాలీవుడ్ పాటలు, రామలీల నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెనసెంట్ మీడియాకు చెందిన తన్వి చంద్రా, కుల్రాజ్ ఆనంద్ ఈ వేడుకల విజయానికి విశేషంగా కృషి చేశారు. వందలాది మంది హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ ప్రతినిధి టామ్‌కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్పాన్సర్లు ప్రేక్షకులకు పలు బహుమతులు అందించడంతో వేడుకల్లో మరింత సందడి నెలకొంది.
సంగీతం, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో బ్రిడ్జ్‌వాటర్ కామన్స్‌లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.