అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం సోమర్‌సెట్‌లో బాలీవుడ్ గర్బా 2026 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉక్రేనియన్ కల్చరల్ సెంటర్‌లో సమయా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 600 మందికి పైగా మహిళలు, పురుషులు, చిన్నారులు హాజరయ్యారు.
గర్బా సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పాల్గొన్నవారు వేడుకల్లో సందడి చేశారు. ప్రముఖ డీజే రాజ్ కురానీ అందించిన సంగీతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రముఖ కమ్యూనిటీ నాయకురాలు సమీక్ష్ శర్మ ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం చివరలో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతకు డైమండ్ రింగ్‌ను బహుమతిగా అందజేశారు. అలాగే, ఉత్తమ దుస్తుల్లో వచ్చిన మహిళకు ప్రత్యేక బహుమతిని అందించారు.
సంగీతం, నృత్యాలు, బహుమతులతో న్యూజెర్సీలో బాలీవుడ్ గర్బా 2026 వేడుకలు సందడిగా ముగిశాయి.