Categories: Movie News

మోసపోయినా మారని మనసు.. మరోసారి ఆర్థిక సాయం చేసిన జీవీ ప్రకాశ్

దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జీవీ ప్రకాశ్ కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నారు.

ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే చలించిపోతారు జీవీ ప్రకాశ్. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తన ఉదారతను చాటుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. చదువులకైనా, వైద్యానికైనా ఆపదలో ఉన్నామని నెటిజన్లు ట్యాగ్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి తన వంతు సహాయం అందిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్లు ఆయన నమ్మకాన్ని, మంచి మనసును ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా ఓ నెటిజన్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అత్యవసరంగా సర్జరీ జరగాల్సి ఉందని, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామంటూ సాయం కోరుతూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ను చూసిన తోటి నెటిజన్లు జీవీ ప్రకాష్‌కు ట్యాగ్ చేయగా.. ఆయన వెంటనే స్పందించారు. గతంలో జరిగిన మోసాన్ని అస్సలు లెక్కచేయకుండా, సదరు నెటిజన్ అకౌంట్‌కు తక్షణ సహాయంగా రూ. 50,000 ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతేకాదు ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. “నా తరఫున ఇది చాలా చిన్న సాయం. ఈసారి మీరు చెప్పిన సమస్య నిజమేనని నమ్ముతున్నాను” అంటూ రిప్లై ఇచ్చారు.

సాధారణంగా ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు ఒకసారి ఎదురైతే ఎవరైనా సరే సాయం చేయాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. కొందరైతే అభ్యర్థనలను పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారు. కానీ జీవీ ప్రకాష్ మాత్రం అలా చేయలేదు. ఆ చేదు అనుభవాన్ని మనసులో పెట్టుకోకుండా, మానవత్వమే పరమావధిగా భావించారు. వెంటనే సాయం చేశారు. దీంతో జీవీ ప్రకాశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ManaTV Team

Recent Posts

అర్జెంటీనా అద్భుత విజయం.. మెస్సీ కన్నీళ్లు !!

ఓటమి ఖాయమై, అభిమానుల గుండెలు పగిలిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని అసాధారణ విజయాన్ని అందుకుంది అర్జెంటీనా. ఈజిప్ట్‌తో జరిగిన…

4 hours ago

సౌరవ్ గంగూలీ బయోపిక్.. ‘దాదా’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్…

4 hours ago

అమెరికా 250 ఏళ్ల చరిత్ర.. టామా 45 ఏళ్ల ప్రస్థానం! ఒకే వేదికపై అద్భుతమైన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’

జార్జియా: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఒక అద్భుతమైన మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక 'ఆర్ట్ ఎగ్జిబిషన్' (కళా…

6 hours ago

అల్లు అర్జున్‌కి నో చెప్పిన ‘బ్లాస్ట్’ బ్యూటీ.?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్…

8 hours ago

‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం నుంచి ‘తబాహి’ పేరుతో ఫస్ట్ వీడియో…

11 hours ago

ప్రపోజ్ చేసిన అబ్బాయికి రాఖీ కట్టా.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా నటి అంజలి

స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా…

12 hours ago