Categories: Movie News

తమిళ పొలిటికల్ థ్రిల్లర్‌లో సునీల్.. ఫస్ట్ లుక్ రిలీజ్!

తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’. ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో సునీల్ ‘ సంపత్ రావు’ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన ‘లూసిఫర్’, ‘ఎంపురాన్’ చిత్రాలకు రచయితగా పనిచేసిన మురళీ గోపి ఈ సినిమాకు కథ అందించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విధికి, కుట్రలకు భయపడని ఒక తిరుగుబాటు నాయకుడిగా ఆర్య పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆర్య, సునీల్‌తో పాటు రెజీనా కసాండ్రా, నిఖిల విమల్, ఇంద్రాన్స్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఎస్ యువ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv

అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…

8 hours ago

Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv

Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…

8 hours ago

#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV

#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…

8 hours ago

No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive

No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…

9 hours ago

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success Dr.ms Reddy #manatvlive

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…

10 hours ago

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…

12 hours ago