Find Articles

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆఫ్‌లైన్ టికెట్లపైనా రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆఫ్‌లైన్ టికెట్లపైనా రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్!

రైల్వే ప్రయాణికులకు సంబంధించి రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. అక్టోబర్ 27 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా రూ.10 లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ బీమా సౌకర్యం ఉద్దేశం.

అయితే, ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందాలనుకునే ప్రయాణికులు టికెట్ ధరకు అదనంగా 45 పైసలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మొత్తాన్ని నగదు రూపంలో స్వీకరించడం సాధ్యం కాదని, డిజిటల్ చెల్లింపుల ద్వారానే చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

ఈ నేపథ్యంలో టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మార్పుతో ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందే అవకాశం కలగనుంది.

ManaTV Team