దేశంలో టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా 1.23 లక్షల టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు ‘ఎక్స్‌ఫెనో’ నివేదిక వెల్లడించింది. గత 18 నెలల్లో ఇదే అత్యధిక ఉద్యోగ నియామకాలని పేర్కొంది.
సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్‌లో టెక్ ఉద్యోగాల సంఖ్య 5 శాతం పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదైంది.
అయితే ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం అనుభవజ్ఞులకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 68 వేల పోస్టులు మిడ్ నుంచి సీనియర్ లెవల్ అభ్యర్థుల కోసం ఉండగా.. ఫ్రెషర్లకు కేవలం 15 వేల అవకాశాలు మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.
నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 31 వేల, హైదరాబాద్‌లో 14 వేల, ఢిల్లీ-ఎన్సీఆర్లో 9 వేల టెక్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక పని విధానంలోనూ ఆఫీస్ ఆధారిత ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తం టెక్ ఉద్యోగాల్లో 81 శాతం ఆఫీస్ వర్క్‌కు సంబంధించినవేనని తెలిపింది.
2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక…
The upcoming film Eetha has created history with a remarkable achievement in Pune, entering both…
యాక్షన్ కింగ్ అర్జున్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న…
ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు…
బీసీల హక్కుల సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో భారీ బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ…
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు అమల్లోకి…