Find Articles

‘జననాయగన్’ రిలీజ్‌కు లైన్ క్లియర్? .. ఈనెల 26న విడుదలకు ప్లాన్

‘జననాయగన్’ రిలీజ్‌కు లైన్ క్లియర్? .. ఈనెల 26న విడుదలకు ప్లాన్

తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమా విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్నో వాయిదాల తరువాత, ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి వచ్చే అనుమతిపైనే ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంది. అయితే, జూన్ 19 నాటికి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే, జూన్ 26న సినిమా విడుదల ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ జూన్ 22 నాటికి అనుమతులు లభించకపోతే, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీసుకున్న అడ్వాన్సులను తిరిగి చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అంతేకాదు తన పారితోషికాన్ని సైతం వెనక్కి ఇచ్చేందుకు విజయ్ ముందుకు వచ్చారని తెలుస్తోంది.

హెచ్ . వినోద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని భావించారు. కానీ గతేడాది డిసెంబర్‌లో సెన్సార్‌కు వెళ్లినప్పటి నుంచి ఈ చిత్రానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఫిర్యాదులు, రివైజింగ్ కమిటీ సమీక్షలు, మద్రాస్ హైకోర్టు తరువాత సుప్రీంకోర్టులలో న్యాయపోరాటాలు, ఏప్రిల్‌లో సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం వంటి పలు కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మరి జూన్ 26న రిలీజ్ అవుతుందా.? మరోసారి వాయిదా పడుతుందా.? అనేది చూడాలి.

ManaTV Team