Find Articles

ఇస్రో రాకెట్ల తయారీ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల ఆందోళన

ఇస్రో రాకెట్ల తయారీ ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాల ఆందోళన

ఇస్రో రాకెట్ల తయారీ, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రతిపాదనలపై ఇస్రోలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సెప్టెంబర్ 4న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్‌కు లేఖ రాశాయి.

రాకెట్ల తయారీ, నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇస్రో భవిష్యత్ పాత్ర, ఉద్యోగుల భవితవ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇస్రోను కేవలం పరిశోధన, అభివృద్ధి (R&D) సంస్థగా పరిమితం చేసి, కీలక కార్యకలాపాలను ప్రైవేట్ రంగానికి అప్పగించే విధానాన్ని తాము అంగీకరించబోమని సంఘాలు స్పష్టం చేశాయి.

ManaTV Team