వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై కస్టమర్ల నుంచి ఫిర్యాదు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా స్పామ్ కాల్స్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా చర్యలు తీసుకునేలా టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
టెలికాం నెట్‌వర్క్‌లోని AI ఆధారిత వ్యవస్థలు అనుమానాస్పద స్పామ్ కాల్స్‌ను గుర్తిస్తాయి. తొలిసారి స్పామ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే 15 రోజుల పాటు అవుట్గోయింగ్ కాల్స్‌ను నిలిపివేయడం, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిని ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రమోషనల్ కాల్స్‌ను ఎలా ఆపాలి?
ప్రమోషనల్ కాల్స్, మార్కెటింగ్ సందేశాలు వద్దనుకునే వినియోగదారులు 1909 నంబర్‌కు BLOCK PROMO అని SMS పంపవచ్చు.
ఈ కొత్త విధానంతో వినియోగదారులకు తరచూ ఇబ్బంది కలిగించే అవాంఛిత ప్రమోషనల్, స్పామ్ కాల్స్‌ను మరింత సమర్థంగా నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.