Categories: Movie News

రేపే ‘నాగబంధం’ రిలీజ్… ప్రారంభమైన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్

భారీ అంచనాల నడుమ రాబోతున్న ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రచారాన్ని మొదలుపెట్టింది.

అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించగా.. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమయ్యాయి.

అంతేకాదు ఈ సినిమాపై ‘బుక్‌మైషో’లో ఇప్పటికే లక్షకు పైగా ఆసక్తులు నమోదయ్యాయని, “రేపటి నుంచి తాండవం మొదలవుతుంది” అని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రధాన పాత్రధారి భారీ దేహంతో, చుట్టూ నాగసర్పాలతో ఉన్న లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తూ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ManaTV Team

Recent Posts

ఇంద్రియాలను నియంత్రిస్తే మనశ్శాంతి | భగవద్గీత శ్లోకం 64 | Bhagavad Gita 2:64 #manatv

ఇంద్రియాలను నియంత్రిస్తే మనశ్శాంతి | భగవద్గీత శ్లోకం 64 | Bhagavad Gita 2:64 #manatv #bhagavadgita #geetha #geethasloka…

6 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 7-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 7-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…

7 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 7-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 7-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

7 hours ago

40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వం రద్దుకు చర్యలు

స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…

22 hours ago

ఫ్లైదుబాయ్‌ కోపైలట్‌ దాడిలో గాయపడిన భారతీయ పైలట్‌ ఆరోగ్యం మెరుగుపడుతోంది

ఫ్లైదుబాయ్‌ విమానంలో కోపైలట్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…

22 hours ago

అట్లాంటాలో ఘనంగా మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026

అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…

24 hours ago