శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం.
ఇందులో భాగంగా ఆయన కదిరి నియోజకవర్గ పరిధిలోని నల్లచెరువు జెడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవుతున్నారు.
నామినేషన్ ప్రక్రియలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆయనతో కలిసి పాల్గొననున్నారు.
జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవికి పరిటాల శ్రీరామ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేయడంతో రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.