Find Articles

కేవలం రూ.7తో లాటరీ టికెట్.. నిరుపేద మహిళకు రూ.కోటి జాక్‌పాట్!

కేవలం రూ.7తో లాటరీ టికెట్.. నిరుపేద మహిళకు రూ.కోటి జాక్‌పాట్!

అదృష్టం ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో చెప్పలేం. పంజాబ్‌లోని కోట్‌కపురాకు చెందిన బిమ్లా దేవికి ఇదే అనుభవమైంది. పిల్లలకు బట్టలు కొనడానికి వెళ్లిన ఆమె, కేవలం రూ.7తో లాటరీ టికెట్ కొనుగోలు చేయగా, ఏకంగా కోటి రూపాయల జాక్‌పాట్ గెలుచుకున్నట్లు సమాచారం.

బిమ్లా దేవి ఓ దినసరి కూలీ భార్య. కుటుంబ పోషణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె, కోట్‌కపురాలోని రైల్వే రోడ్డులో ఉన్న స్టార్ లాటరీ స్టాల్‌లో సిక్కిం ప్రభుత్వ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. లాటరీ ఫలితాల్లో ఆమెకు కోటి రూపాయల బహుమతి తగిలినట్లు స్టాల్ నిర్వాహకులు ఫోన్ ద్వారా తెలియజేశారు.

ఈ వార్త తెలియడంతో బిమ్లా దేవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్లూ కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన తమకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. వచ్చిన మొత్తంతో పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు, చిన్న వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేవలం రూ.7 పెట్టుబడితో కోటి రూపాయల బహుమతి గెలుచుకున్న ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

ManaTV Team