– రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
– మే 18న గ్రాండ్‌గా ట్రైలర్ రిలీజ్
– సోషల్ మీడియాలో మొదలైన ‘మెగా’ సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో సందడి షురూ అయింది.
ఉప్పెన తరువాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక దీనికి ఒక రోజు ముందుగా అంటే జూన్ 3న ప్రీమియర్ షోలు ఉండనున్నాయి.
ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా సినిమాగా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…