Find Articles

రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్.. కాశీలో షూటింగ్

రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్.. కాశీలో షూటింగ్

సినీ నటి రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె, తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

యమునా కిశోర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంది. ఈ విషయాలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దర్శకుడు యమునా కిశోర్‌తో పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోందన్న ఆమె, శంకర్ ఇందుచూడన్ వంటి ప్రతిభావంతుడైన నటుడితో కలిసి నటించడం ఉత్సాహాన్ని కలిగిస్తోందని తెలిపారు. మరీ ముఖ్యంగా మహాదేవుడి క్షేత్రమైన కాశీలో షూటింగ్ జరగడం దైవానుగ్రహంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ManaTV Team