Find Articles

నటి నివేదా పేతురాజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్.. #Mega158 సెట్స్ లో సెలబ్రేషన్స్

నటి నివేదా పేతురాజ్‌కు స్పెషల్ సర్ప్రైజ్.. #Mega158 సెట్స్ లో సెలబ్రేషన్స్

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం #Mega158. ఈ సినిమా సెట్స్‌లో నటి నివేదా పేతురాజ్‌కు చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. నివేదా పేతురాజ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నివేదా తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘ఒరు నాల్ కూతు’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్, దశాబ్ద కాలంగా తన కెరీర్‌లో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని ‘మెగా158’ టీం ఆమెను గౌరవించింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ తమిళనాడులోని పొల్లాచ్చిలో విజయవంతంగా పూర్తయింది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో #Mega158పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కేవీఎన్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘జైలర్’, ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాలకు పనిచేసిన విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది.

ManaTV Team