టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సైరాబాను’ తొలి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
ఇటీవల హైదరాబాద్‌లో 15 రోజుల పాటు సాగిన తొలి షెడ్యూల్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ బాంధవి శ్రీధర్, వెన్నెల కిషోర్‌లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తొలి షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా సెట్స్‌లోని సందడి, సరదా క్షణాలను చూపిస్తూ చిత్రబృందం ఓ ‘బిహైండ్ ది సీన్స్’ (BTS) వీడియోను విడుదల చేసింది.
హిందూ యువకుడు, ముస్లిం యువతి మధ్య సాగే వైవిధ్యభరితమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ హైదరాబాద్, రాజమండ్రి నగరాల నేపథ్యంలో సాగనుంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
న్యూజిలాండ్‌లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు…
న్యూజెర్సీ నార్త్ బ్రన్స్‌విక్‌లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి…
చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ ను అందించిన…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు…
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు.…