Categories: Movie News

రోషన్ కనకాల మూడో సినిమా.. సైన్స్ ఫిక్షన్‌తో ప్రయోగం!

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ‘బబుల్‌గమ్’, ‘మోగ్లి’ చిత్రాలతో హీరోగా పరిచయమైన ఆయనకు ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో, మూడో సినిమా కోసం రోషన్ ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు విఐ ఆనంద్ కథ అందించడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. విజయ్ కె. కమ్మిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా… బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు పనిచేసిన దిగ్గజ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ పనిచేస్తుండటం విశేషం.

సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ అంశాలతో భారీ బడ్జెట్‌, ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ సరసన గహజీ షిజు కున్నత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, సుదర్శన్, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ManaTV Team

Recent Posts

Modi New Zealand: న్యూజిలాండ్ భారతీయుల ప్రేమాభిమానాలు హృదయాన్ని తాకాయి: ప్రధాని మోదీ

న్యూజిలాండ్‌లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కరూర్‌లో సీఎం విజయ్ రోడ్ షోకు ఘన స్వాగతం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు…

2 hours ago

న్యూజెర్సీలో సాయి బాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ

న్యూజెర్సీ నార్త్ బ్రన్స్‌విక్‌లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి…

3 hours ago

డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ .. హీరో పోటీలో సూర్య – ధనుష్?

చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ ను అందించిన…

4 hours ago

అక్కినేని అఖిల్ ‘ లెనిన్ ’ సినిమాకు సామ్ విషెస్.. పోస్ట్ వైరల్!!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

‘సైరాబాను’ సందడి షురూ.. తొలి షెడ్యూల్ పూర్తి

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సైరాబాను' తొలి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా…

11 hours ago