
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావు బహదూర్’. తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన “జస్ట్ ఎ టీజర్” ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
ఈ సినిమాలో సత్యదేవ్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఒంటరితనం, మానసిక వేదన, జీవితం వంటి పలు అంశాలపై పోరాడే వ్యక్తిగా ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఆయన లుక్, నటన, పాత్ర తీరు గత చిత్రాల కంటే భిన్నంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోయిన్గా దీపా థామస్ నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాలా పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు.
జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వెంకటేష్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం. మొత్తంగా, ‘రావు బహదూర్’ కొత్త తరహా సైకాలజికల్ డ్రామాగా కనిపిస్తోంది. బలమైన కథ, విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.టీజర్ తో భారీ అంచనాలు ఏర్పడగా.. ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

