సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాలో ఆయన పాత్ర పేరును కూడా ప్రకటించింది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాజీ ‘లైలం బాబు’ అనే శక్తిమంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో త్వరలో పెద్ద తెరపై కనిపిస్తారు అని చిత్ర నిర్మాణ సంస్థ వజ్ర వారాహి సినిమాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దర్శకుడు ప్రసన్న కుమార్ కోటకు ఇది తొలి చిత్రం కాగా.. సుడిగాలి సుధీర్‌కు హీరోగా ఐదో సినిమా. వ్యవసాయ కుటుంబాల్లో తరచూ వినిపించే స్థానిక పలుకుబడి నుంచే ‘హైలెస్సొ’ అనే టైటిల్‌ను తీసుకున్నట్లు తెలిపింది.
గతేడాది సెప్టెంబర్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ నక్షా శరణ్ పోషిస్తున్న ‘జెస్సీ’ పాత్రను కూడా చిత్రబృందం పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, ఎడిటర్‌గా ఛోటా కె. ప్రసాద్, రచయితగా చింతా శ్రీనివాస్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…