మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మెహసానా జిల్లాలోని వద్నగర్ సమీపంలోని గుంజా గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలికాప్టర్లో లోపం కారణంగా అది అక్కడి నుంచి బయలుదేరలేకపోయింది. దీంతో షిండే కారులో విస్నగర్కు బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వద్నగర్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు షిండే అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందం చర్యలు చేపట్టింది.