అమెరికాలోని చార్లెట్ వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ వేడుకలు ఘన విజయం సాధించాయి. ప్రవాస తెలుగువారందరినీ ఒకచోట చేర్చి సాంస్కృతిక శోభతో అలరించిన ఈ మహాసభల విజయవంతం వెనుక దాతల ఉదారత కీలక పాత్ర పోషించింది. కన్వెన్షన్ నిర్వహణ కోసం పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు మరియు టీటీఏ నేతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ మొత్తంలో నిధులను సమకూర్చారు.
ఈ వేడుకల విజయానికి ఆర్థికంగా అండగా నిలిచిన దాతల వివరాలను పరిశీలిస్తే… అత్యధికంగా $100K భారీ విరాళాన్ని అందించిన వారిలో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, నవీన్ రెడ్డి మలిపెద్ది, రాజా పుష్ప, చంద్రమౌళి మరియు శాంతికిరణ్ ఉన్నారు. అలాగే, కన్వెన్షన్ నిర్వహణ నిమిత్తం ప్రతిష్టాత్మకంగా $50K విరాళం అందించిన వారిలో వంశీ రెడ్డి, ప్రవీణ్ చింత. జె, డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, అజయ్, కిశోర్ కంచర్ల, నరేంద్ర దేవరపల్లి, సురేష్ బత్తినేని, రాజు పగడాల (ప్రైమ్ డెవలపర్స్), మోహన్ పాటలోళ్ల, మహేందర్ ముసుకు, ఎంఎస్ఎన్ రియల్టీ తరపున వెంకట రమణ, మరియు రవి – నాగార్జున (XPAT) ఉన్నారు. ప్రవాస తెలుగు సంస్కృతిని సమున్నతంగా చాటేలా నిర్వహించిన ఈ కన్వెన్షన్‌కు సహకరించిన ప్రతి ఒక్క దాతకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్…
టీటీఏ (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2026 మెగా కన్వెన్షన్ అమెరికాలోని చార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ…
అమెరికాలోని చార్లెట్‌లో ఘనంగా నిర్వహించిన టీటీఏ (తెలుగు టైగర్స్ ఆఫ్ అమెరికా) మెగా కన్వెన్షన్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను…
అమెరికాలోని షార్లెట్ నగరం వేదికగా వైభవంగా జరుగుతున్న 'తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకల్లో…
టీటీఏ మెగా కన్వెన్షన్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం జరిగింది. టీటీఏ…