Categories: NRI Updates

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శివారెడ్డి మిమిక్రీ సందడి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వినోద ప్రదర్శన

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు. తనదైన శైలి, చమత్కారమైన కామెడీ టైమింగ్, విభిన్న గొంతుల అనుకరణతో సభలో నవ్వుల పువ్వులు పూయించారు.

కార్యక్రమాన్ని గానకోకిల ఎస్. జానకి గారి స్వరాన్ని అద్భుతంగా అనుకరిస్తూ పాటతో ప్రారంభించిన శివారెడ్డి, ఆ తర్వాత ప్రముఖ గాయకులు ఘంటసాల, కే.జే. జేసుదాస్, రమణ గోగుల, జెస్సీ గిఫ్ట్ తదితరుల గొంతులను అనుకరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా ప్రజాకవి గద్దర్ గారి శైలిలో ఆలపించిన పాటలు సభలో విశేష ఆదరణ పొందాయి.

గాయకులతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు వి. హనుమంతరావు, కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), నారా చంద్రబాబు నాయుడు, డా. వైఎస్ రాజశేఖర రెడ్డిల మాట్లాడే తీరును అద్భుతంగా అనుకరించి ప్రేక్షకుల నుంచి ఘనమైన చప్పట్లను అందుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ శైలిలో చేసిన మిమిక్రీ కూడా సభికులను విశేషంగా ఆకట్టుకుంది.

విభిన్న స్వరాలు, హాస్యభరితమైన ప్రదర్శనలు, చమత్కారమైన వ్యాఖ్యలతో సాగిన శివారెడ్డి మిమిక్రీ మెడ్లీ టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం ముగింపులో టీటీఏ నిర్వాహకులు శివారెడ్డిని ఘనంగా సత్కరించి, ఆయన కళా ప్రతిభను కొనియాడారు.

ఈ ప్రదర్శన కన్వెన్షన్‌కు హాజరైన తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయమైన వినోదాన్ని అందించడంతో పాటు కార్యక్రమ విజయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ManaTV Team

Recent Posts

మెల్‌బోర్న్‌లో ఘనంగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవం.. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం !

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్…

1 hour ago

“11 ఏళ్లలోనే నంబర్-1 తెలుగు సంస్థగా టీటీఏ.. విజయ రహస్యం చెప్పిన డాక్టర్ మోహన్ రెడ్డి!”

టీటీఏ (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2026 మెగా కన్వెన్షన్ అమెరికాలోని చార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ…

4 hours ago

టీటీఏ మెగా కన్వెన్షన్-2026 విజయం.. వాలంటీర్ల కృషే బలం- విజయపాల్ రెడ్డి

అమెరికాలోని చార్లెట్‌లో ఘనంగా నిర్వహించిన టీటీఏ (తెలుగు టైగర్స్ ఆఫ్ అమెరికా) మెగా కన్వెన్షన్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా…

5 hours ago

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ ఘన విజయం.. దాతలకు ప్రత్యేక అభినందనలు

అమెరికాలోని చార్లెట్ వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా…

24 hours ago

అమెరికాలో నవీన్ పోలిశెట్టి సందడి.. ప్రభాస్‌తో స్నేహంపై ఆసక్తికర వ్యాఖ్యలు!

అమెరికాలోని షార్లెట్ నగరం వేదికగా వైభవంగా జరుగుతున్న 'తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకల్లో…

1 day ago

టీటీఏ మెగా కన్వెన్షన్.. ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం

టీటీఏ మెగా కన్వెన్షన్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం జరిగింది. టీటీఏ…

1 day ago