అమెరికాలోని షార్లెట్ నగరం వేదికగా వైభవంగా జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TTA) మెగా కన్వెన్షన్ 2026 వేడుకల్లో యువ హీరో, టాలెంటెడ్ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై తనదైన చమత్కారం, కామెడీ టైమింగ్‌తో అభిమానులను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. షార్లెట్‌కు మళ్లీ రావడంపై తన మార్క్ హెల్తీ కామెడీతో సందడి చేశారు. “నేను పుట్టిన ఊరు ఇదేనండి.. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో ఇండియాకు వెళ్లాల్సి వచ్చింది” అని సరదాగా అనడంతో ఆడిటోరియంలో నవ్వుల పువ్వులు పూశాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ గారితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వారిద్దరి స్నేహం గురించి అడగ్గా నవీన్ స్పందిస్తూ:తమ ఇద్దరిదీ ఇప్పటి స్నేహం కాదని, చిన్ననాటి మిత్రులమని వెల్లడించారు. ప్రభాస్ గారితో ఉన్న అనుబంధం, తమ ఫ్రెండ్‌షిప్ ముచ్చట్ల గురించి చెప్పాలంటే ఒక గంట సమయం ఉండే పాడ్‌కాస్ట్ (Podcast) కూడా సరిపోదని చమత్కరించారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్…
టీటీఏ (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2026 మెగా కన్వెన్షన్ అమెరికాలోని చార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ…
అమెరికాలోని చార్లెట్‌లో ఘనంగా నిర్వహించిన టీటీఏ (తెలుగు టైగర్స్ ఆఫ్ అమెరికా) మెగా కన్వెన్షన్-2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా…
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుత ప్రతిభతో ప్రేక్షకులను…
అమెరికాలోని చార్లెట్ వేదికగా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా…
టీటీఏ మెగా కన్వెన్షన్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం జరిగింది. టీటీఏ…