Categories: India News

బెళగావిలో తీవ్ర విషాదం.. ఫ్రిజ్ పేలి నలుగురు మృతి

కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వినాయక చవితి వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలిన వెంటనే ఇంట్లో మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

ఈ ప్రమాదంలో గజానన్ ధామోన్ (65), శారద (45), భారతి (50), రోషన్ (21) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఫ్రిజ్ పేలడానికి గల అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి విద్యుత్ లోపమా, గ్యాస్ లీకేజీనా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ManaTV Team

Recent Posts

ముంబైలో వైభవంగా గణేశోత్సవాలు.. లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న రామ్‌దేవ్ బాబా

ముంబైలో గణేశోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

2 hours ago

బ్యాంక్ ఉద్యోగులకు కీలక అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల సమ్మె?

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె చేపట్టే అవకాశం ఉంది. వారానికి నాలుగు శనివారాలు…

2 hours ago

అమెరికా సంచలన ప్రకటన.. అంతరిక్షంలో ఆయుధాలు ఉన్నాయని తొలిసారి ధ్రువీకరణ!

అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా ధ్రువీకరించింది. అయితే ఆ ఆయుధాలు ఏ…

2 hours ago

పాకిస్థాన్‌ కీలక నిర్ణయం.. చైనాకు గాడిద చర్మం, మాంసం ఎగుమతులు!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌.. చైనాతో మరో కీలక వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైంది. చైనాలో గాడిద చర్మం, మాంసానికి…

2 hours ago

ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే | భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 #bhagavadgita #manatv

ఆత్మ ఎప్పటికీ శాశ్వతమే | భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 12 #bhagavadgita #manatv #bhagavadgita12 #gitaslokam #gitateachings #sreekrishna…

8 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 15-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice #manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 15-9-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…

8 hours ago