Find Articles

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, కథా రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. రీసెంట్ గా ఆయన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు.భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్‌.. 1981 లో నటి ప్రవీణను పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమె మరణించారు. ఆ తరువాత 1984లో ప్రముఖ నటి పూర్ణిమను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. పూర్ణిమ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించారు. అలాగే భాగ్యరాజ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా, కథా రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబించే కథలు, ఎంతో సహజమైన సంభాషణలు, భావోద్వేగాలతో కూడిన సినిమాలకు భాగ్యరాజ్ పెట్టింది పేరు.తన సినీ కెరీర్ లో సుమారు 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన 75కిపైగా సినిమాల్లో నటించారు.

ManaTV Team