Find Articles

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు.

ManaTV Team