– తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం
– సోషల్ మీడియాలో త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్
తమిళనాడు సీఎంగా నటుడు విజయ్ ప్రమాణస్వీకారం చేయగా.. ఈ కార్యక్రమంలో ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఈవెంట్ తరువాత సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ దానికి ‘ The Love is Always Louder’’ అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే విజయ్, త్రిష మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై వస్తున్న ప్రచారానికి ఈ క్యాప్షన్ మరింత బలాన్ని చేకూర్చింది. మొత్తంగా విజయ్ సీఎంగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి త్రిష రావడం, ఆ తరువాత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష భావోద్వేగానికి గురైన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. విజయ్ ప్రసంగం సమయంలో ఆమె కళ్లలో ఆనందబాష్పాలు కనిపించగా… దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక..తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్, త్రిష జంట బాగా ఫేమస్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆతి’, ‘కురువి’, ‘లియో’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వీరిద్దరూ కలిసి కొన్ని వేడుకలకు హాజరుకావడం, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పరోక్ష పోస్టులు పెట్టడం వంటివి ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.. ఇక తాజాగా విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరైన త్రిష.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…