-జెడ్ ప్లస్ సెక్యూరిటీలో మొత్తం 55 మంది సిబ్బంది
-జెడ్ ప్లస్ సెక్యూరిటీ పరిధిలోకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, పైలట్ వాహనాలు
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం జెడ్ ప్లస్ భద్రతను కల్పించింది. ఈ క్రమంలోనే MP5 రైఫిళ్లతో కూడిన 55 మంది కేంద్ర భద్రతా దళ సిబ్బంది 24 గంటల పాటు భద్రతను అందిస్తున్నారు. సీఎం భద్రతా సిబ్బందికి, పది మందికి పైగా ఎన్ఎస్జీ కమాండోలను కూడా కేంద్ర ప్రభుత్వం జత చేసింది.
సీఎం విజయ్ కు కల్పించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో మొత్తం 55 మంది సిబ్బంది ఉంటారు. వీళ్లలో 10 నుంచి 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు ఉంటారు. ఎన్ఎస్జీ కమాండోలతో పాటు, సీఆర్ఫీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది కూడా ఉంటారు. వీరంతా సీఎం విజయ్ కు 24/7 భద్రత కల్పిస్తారు. వీటితో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, పైలట్ వాహనాలు కూడా ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ పరిధిలోకి వస్తాయి. అయితే ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రాణహాని ఉండే ప్రముఖులకు, పారిశ్రామిక వేత్తలకు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉంది. జెడ్ ప్లస్ కమాండోలు అత్యాధునిక ఆయుధాలతో ప్రతిక్షణం పహారా కాస్తారు.
ఇక తమిళనాడులో ఆరు దశాబ్దాల తరువాత ద్రవిడయేతర ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తంగా విజయ్ కేబినెట్ యువత, అనుభవజ్ఞుల కలయికగా ఏర్పాటైంది.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం 'ది ఇండియా…
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తయి ‘ఏ’…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం 'మెగా158' (వర్కింగ్ టైటిల్).జూన్ 22న హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్…
టాలీవుట్ స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో…
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ ‘లెనిన్’. తాజాగా ఈ చిత్రానికి…
పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ చర్యలను సమర్థించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన…