Categories: NRI Updates

TTA మెగా కన్వెన్షన్‌కు కీరవాణి స్పెషల్ అట్రాక్షన్

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 17 నుంచి 19 వరకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) జరగనున్న విషయం తెలిసిందే.. ఈ మూడు రోజులు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన, మహిళా, సాహిత్య, ఆధ్వాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికాలోని తెలుగు సమాజానికి చెందిన అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. ఈ మూడు రోజుల మహాసభకు వేలాది తెలుగు కుటుంబాలు, ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు హాజరుకానున్నారు. వీళ్లందరిని అలరించడం కోసం జులై 19న కీరవాణి ప్రత్యేక సంగీత విభావరి నిర్వహించనున్నారు. అంతే కాకుండా త్రీయోరీ బ్యాండ్, ఆరెంజ్ స్ట్రీట్ (Orange Street) బృందాల ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

 

ManaTV Team

Recent Posts

TTA Mega Conventionలో యూఎస్ పొలిటికల్ ఫోరం.. అమెరికా రాజకీయాలపై ఆది రెడ్డి సాథి ప్రత్యేక ప్రసంగం

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…

6 hours ago

H-1B, గ్రీన్ కార్డ్, EB-5 వీసాలపై నిపుణుల మార్గదర్శనం

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస…

6 hours ago

TTA లో 100కు పైగా వ్యాపార సంస్థల ప్రదర్శనలు

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…

6 hours ago

అమెరికాలో జూలై 19న శ్రీనివాస కళ్యాణం

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…

6 hours ago

మాట నిలబెట్టుకున్న అఖిల్.. అభిమానిని కలిసిన హీరో

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…

9 hours ago

అర్జెంటీనాపై పక్షపాత ఆరోపణలు.. విమర్శకులకు మెస్సీ కౌంటర్

ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. తమ విజయాలను పక్షపాతంతో…

11 hours ago