టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఇమ్మిగ్రేషన్ ఫోరం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా అమెరికా వలస చట్టాలు, వీసా విధానాలపై ప్రత్యేక ‘టీటీఏ ఇమ్మిగ్రేషన్ ఫోరం’ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా కార్మిక శాఖకు చెందిన కమ్యూనిటీ అవుట్‌రీచ్ నిపుణురాలు ఏమీ కిమ్ ముఖ్య అతిథిగా పాల్గొని వలసలకు సంబంధించిన తాజా నిబంధనలు, ఉద్యోగ విధానాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు భాను బి.జల్లింద్ర, సంతోష్ ఆర్.సోమిరెడ్డి, మధురిమ బోయపాటి పటూరి, మోనా షా, అబ్దుల్ అరిఫ్ తదితరులు ప్రసంగించనున్నారు. EB-5 ఇన్వెస్టర్ వీసాలు, H-1B పిటిషన్లు, PERM లేబర్ ప్రక్రియ, గ్రీన్ కార్డ్, అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్, ఇమ్మిగ్రేషన్‌లో తాజా మార్పులు, ఉద్యోగ సంబంధిత చట్టాలు వంటి కీలక అంశాలపై చర్చించడంతో పాటు పాల్గొనేవారి సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా జులై 19న అమెరికా రాజకీయాలు, ప్రజా విధానాలపై ప్రత్యేక…
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్…
టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి బృందం తన ప్రదర్శనతో అలరించనున్నారు. అమెరికాలోని…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన అభిమానులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్…
ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. తమ విజయాలను పక్షపాతంతో…