Find Articles

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’… డార్లింగ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’… డార్లింగ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ “కొరియన్ కనకరాజు”. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీకి చెందిన ‘కిమ్‌చి కారం టీజర్’ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

“కొరియన్ కనకరాజు ప్రపంచాన్ని మీకు పరిచయం చేయడానికి రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారు” అంటూ చిత్ర యూనిట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర ఎలా ఉండబోతుందో ఈ టీజర్‌తో ఆడియెన్స్ కు ఒక హింట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. “ఇండో-కొరియన్ మ్యాడ్‌నెస్” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

ఇక గాంధీ మేర్లపాక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ బ్యానర్‌లపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో, ఆయన ఈ సినిమా టీజర్‌ను లాంఛ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ManaTV Team