Find Articles

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2 ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

‘ విశ్వంభర’ Vs ‘ జైలర్ 2  ’ .. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ.?

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ ఎపిక్ చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రం విడుదలపై తాజాగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘బింబిసార’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘విశ్వంభర’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. చిరంజీవి కెరీర్‌లో ఇదొక విభిన్నమైన ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ‘ విశ్వంభర’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఆసక్తిని మరింత పెంచాయి. కుటుంబ ప్రేక్షకులు, సెలవుల వాతావరణం నేపథ్యంలో ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్రం కూడా దసరా సీజన్ ను టార్గెట్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’, ‘ జైలర్ 2’ ఒకే సమయంలో విడుదల అయితే, భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ బాక్సాఫీస్ పోటీ జరగడం ఖాయం. కానీ, ఈ పోటీ ఉంటుందా.?లేదా.? అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ManaTV Team