Find Articles

సినిమా అంటే ఉద్యోగం కాదు.. రానా సెన్సేషనల్ కామెంట్స్.!

టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల కాంత అనే డిఫరెంట్ కంటెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయారు.

ఇదిలా ఉంచితే సినీ ఇండస్ట్రీ, షూటింగ్స్ సమయంలో నటీనటులు పడే కష్టం గురించి రానా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. “సినిమా అనేది కేవలం ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే ఉద్యోగం కాదు, అది ఒక లైఫ్‌స్టైల్. ఆ జీవనశైలిలో మీరు కొనసాగాలా.? వద్దా.? అనేది పూర్తిగా మీ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రతి సినిమా కూడా మేకర్స్ నుంచి, నటీనటుల నుంచి ఇంకేదో ఒక కొత్త విషయాన్ని ఆశిస్తూనే ఉంటుంది. కేవలం ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే ఒక అత్యుత్తమమైన సన్నివేశం వచ్చేస్తుందని అనుకోవడానికి ఇదేమీ వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీ కాదని రానా స్పష్టం చేశారు.

కొన్నిసార్లు మనం సెట్స్‌పై వరుసగా 15 గంటల పాటు ఎంతో కష్టపడి షూటింగ్ చేసినా కూడా, ఆశించిన స్థాయిలో ఒక్క మంచి సీన్ కూడా రాకపోవచ్చని రానా తెలిపారు. సినిమా అనేది పూర్తిగా మనం చేసే ప్రాజెక్ట్‌ను బట్టి, అందులోని సిచ్యుయేషన్లను బట్టి మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. కేవలం గంటల లెక్కన కాకుండా, క్రియేటివిటీ కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకోవడమే సినీరంగానికి ఉన్న ప్రత్యేకత అని తెలిపారు.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *